calender_icon.png 3 January, 2026 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్‌స్టేషన్ విలీనం వద్దంటూ బీఆర్‌ఎస్ ధర్నా

03-01-2026 12:00:00 AM

బొల్లారంలో నాయకుల నిరసన  

జిన్నారం/అమీన్ పూర్, జనవరి 2 : బొల్లారం పోలీస్ స్టేషన్ను ఎత్తివేయడాన్ని నిరసిస్తూ బిఆర్‌ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. జిహెచ్‌ఎంసి డివిజన్ 272 పరిధిలోని గాంధీ బొమ్మ సమీపంలో శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. బొల్లారం పోలీస్ స్టేషన్ రద్దు చేసి అమీన్ పూర్ పోలీస్ సర్కిల్ పరిధిలో చేర్చడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమం జిన్నారం జడ్పిటిసి కొలన్ బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో  చేపట్టా రు. 40 ఏళ్లకు పైబడిన చరిత్ర ఉన్న బొల్లా రం పోలీస్ స్టేషన్ తొలగించడం అన్యాయమన్నారు. స్థానికంగా 25 వరకు కాలనీలు 70 వేల జనాభా, 350 పరిశ్రమలు ఉన్న బొల్లారానికి ప్రభుత్వం నిర్ణయంతో రక్షణ లేకుండా పోయిందన్నారు.

పోలీస్ స్టేషన్కు సంబంధించిన ప్రతి విషయానికి ప్రస్తుతం అమీన్పూర్ కు పరుగులు తీయాల్సిన పరిస్థితిని కల్పించారన్నారు. స్థానికంగా 80 శాతా నికి పైగా వలస కుటుంబాలే ఉంటాయనీ, ఇదే సమయంలో ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఉండడం వల్ల వారికి పోలీసుల రక్షణ కరువవుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే ఐడిఏ బొల్లారంలో పోలీస్ స్టేషన్ను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో జిన్నా రం మాజీ ఎంపీపీ కొలన్ రవీందర్ రెడ్డి, బొల్లారం మాజీ కౌన్సిలర్లు వి.వేణుపాల్ రెడ్డి, టీ.సాయి కిరణ్ రెడ్డి, బీరప్ప యాదవ్, సతీష్, శ్రీకాంత్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు బి. జైపాల్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ రత్నం, యాదగిరి, మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు మెంబర్లు, బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.