02-09-2025 05:18:47 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దిన్, మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ నది జలాలను పక్క రాష్ట్రాలకు తరలించి కాలేశ్వరాన్ని ఎండబెట్టి ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు. కామారెడ్డి జిల్లాలోని 25 మండలాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా రాస్తారోకో కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
కెసిఆర్ పైన చేసిన కుట్రలో మాత్రమే కాదు తెలంగాణ నది జిల్లాలను పక్క రాష్ట్రాలకు తరలించి కాలేశ్వరం ఎండబెట్టే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్నారు. సీబీఐకి కాళేశ్వరం అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసేయడమేనన్నారు. నిన్నటిదాకా సీబీఐ పైన వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్కరోజులోనే మాట ఎందుకు మార్చాడని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐకి అప్పజెప్పడం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే మునుముందు ధర్నా కార్యక్రమాలు ఇంకా ఉధృతం చేస్తామన్నారు. బెదిరింపులు కేసులు మా పార్టీకి కొత్త కాదని అన్నారు. ఒకవైపు రైతులు పంటలకు యూరియా లేక అల్లాడిపోతుంటే వారి గురించి పట్టించుకునే వారే కరువయ్యారని అన్నారు.