calender_icon.png 3 September, 2025 | 12:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ కుట్రలను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకుల నిరసన

02-09-2025 05:21:50 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): మోసపూరిత హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేస్తున్న కుట్రలను నిరసిస్తూ మంచిర్యాల కార్పొరేషన్ బీఆర్ఎస్ నాయకులు మంగళవారం మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు ఆందోళన నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంచిర్యాల మాజీ ఎంఎల్ఏ నడిపెల్లి దివాకర్ రావు ఆదేశాల మేరకు నిరసన తెలిపి కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఎండగట్టారు. బీఆర్ఎస్ మంచిర్యాల పట్టణ అధ్యక్షులు గాదె సత్యం ఆధ్వర్యంలో నిర్వహించారు.