18-10-2025 12:18:37 AM
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గడ్డం శ్రీనివాస్‌యాదవ్
హైదరాబాద్, అక్టోబర్ 17(విజయక్రాంతి): బీసీ జేఏసీ శనివారం చేపట్టిన బం ద్‌కు బీఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివా స్‌యాదవ్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గడ్డం శ్రీనివాస్‌యాదవ్‌లు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ భవనంలో, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో జరిగిన, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో, గడ్డం శ్రీనివాస్ యాదవ్ పాల్గొని గోషామహాల్‌లో బంద్‌ను విజయవంతం చేసేందుకు తీసుకొనే చర్యలపై ఆయనతో చర్చించారు.
ఈ సందర్భంగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గత 20 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్ని బీసీల రిజర్వేషన్లు పెంపునకు అడ్డుకోవడం తగదన్నారు. బీసీలకు న్యాయం జరిగే వరకూ వారి పోరాటాలకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటూ ప్రత్యక్షంగా పోరాటం చేస్తుందని గడ్డం శ్రీనివాస్ యాదవ్ తెలిపారు, ఈ బంద్‌కు, అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు, సంఘాలు, వ్యాపార సంఘాలు, కుల సంఘాలు, సంపూర్ణ మద్దతు తెలిపి విజయవంతం చేయాలని గడ్డం శ్రీనివాస్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.