calender_icon.png 18 October, 2025 | 7:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీలకతీతంగా సీఎం సహాయనిధి

18-10-2025 12:17:52 AM

 మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ

హుజురాబాద్,అక్టోబర్ 17:(విజయక్రాంతి); పార్టీలకు అతీతంగా సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తున్నామని మనకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారా యణ అన్నారు. కరీంనగర్ జిల్లా శంకరప ట్నం మండలంలోని కేశపట్నం రైతు వేదికలో శుక్రవారం సీఎం సహాయనిధి చెక్కుల ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయి అన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

ప్రజలకి ఏ పని కావాలన్నా ప్రభుత్వంనేరుగా నా వద్దకు రావాలని అన్నారు. ప్రజల కోసమే నేను పని చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సురేఖ, ఎంపీడీవో గోల్కొండ కృష్ణ ప్రసాద్, బసవయ్య గౌడ్, హుజరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు పద్మ, మహమ్మద్ ఇస్మాముద్దీన్, మొహమ్మద్ షారుక్, రాజు, కొమురయ్యతో పాటు తదితరులుపాల్గొన్నారు.