05-08-2025 01:42:08 AM
ప్రభుత్వం బహిర్గతం చేస్తుందా!
రాష్ట్ర ప్రజల్లో అనుమానం, ఆసక్తి
హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, అవినీతి, నిధుల దుర్వినియోగంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ పూర్తి సమాచారాన్ని 650 పేజీల్లో సంక్షిప్తం చేసింది. ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సమర్పించింది. అయితే అందులో ప్రాజెక్టు సం బంధించి నాటీ సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, నిర్మాణ సంస్థలు, ఇతరుల నుంచి విచారణ సందర్భంగా సేకరించిన వాంగ్మూలం, వివరాలు అన్నింటినీ కమిషన్ పొందుపర్చింది.
అయితే ప్రభుత్వం ఆ 650 పేజీల నివేదికను అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ అధ్యయనం చేసిన అనంతరం మరొక నివేదికను మంత్రి వర్గానికి అందించింది. అధ్యయన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మంత్రి వర్గ సమావేశం నిర్వహించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఒక చర్చ మొదలైంది. జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన 650 పేజీల నివేదికలో ఏముంది?.
దానిని రాష్ట్ర ప్రభుత్వం బహిర్గతం చేస్తుందా?. తెలంగాణ ప్రజలకు పూర్తి స్థాయిలో ఘోష్ కమిషన్ ఉన్న సమాచారమంతా వివరిస్తుందా అని అనుమానం వ్యక్త మవుతుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణ యం తీసుకోబోతుందని ప్రస్తుతం ఆసక్తి మారింది. అయితే ప్రభుత్వం కాళేశ్వరం కమి టీ రిపోర్టుపై ఒకవైపు సిట్‌ను ఏర్పాటు చేసి విచారణ చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
దీంతోపాటు అసెంబ్లీలోనూ కమిష న్ నివేదికపై చర్చ నిర్వహించి ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని చూస్తున్నట్టు సమాచారం. శాసన సభ సమావేశాల సందర్భంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన 650 పేజీల నివేదికను బయటపెట్టే అవకా శం ఉన్నట్టు అధికార వర్గాల నుంచి తెలుస్తోంది. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకల గురించి తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని భావి స్తున్న నేపథ్యంలో త్వరలో కమిషన్ ఇచ్చిన పూర్తి నివేదిక ప్రజా క్షేత్రంలోకి తీసుకువస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు.