04-07-2025 08:03:39 PM
కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ప్రగతి నగర్ లో వంగవీటి మోహన రంగా జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఉత్సవాలల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. అనంతరం క్రిష్ణ మాట్లాడుతూ వంగవీటి మోహన రంగా ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు.