calender_icon.png 5 July, 2025 | 1:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఆర్థిక సహాయం

04-07-2025 08:06:42 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం కాచాపూర్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్తిచేసి మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నగదు బహుమతులను శుక్రవారం అందజేశారు. పదవ తరగతి చదివిన గ్రామానికి చెందిన భూమని ఋషివర్ధన్ కి రూ.25000,  రెండవ ర్యాంక్ సాధించిన విద్యార్థి  చెన్నూగారి లక్ష్మన్ కి రూ. 25000 నగదు బహుమతిని పై చదువులకొరకు ప్రధానోపాధ్యాయుడు రాంచందర్ రావు  చెక్కులను విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేశారు. ఈ నగదు బహుమతిని ప్రధానోపాధ్యాయులు అబ్బాయి కృష్ణ చైతన్య మిత్రుడు  సాత్విక్ రెడ్డి  (అమెరికా ) ఆర్థిక సహాయం చేశారు. గత సంవత్సరం కూడ 10నెలలు క్లాస్లో ఇద్దరకీ రూ. 500 చొప్పున అందజేశారు. కాచాపూర్ గ్రామ విద్యార్థులకు ఆర్థిక సహాయన్ని అందజేస్తున్న సాత్విక్ రెడ్డి కి గ్రామస్తులు, పాఠశాల తరుపున హార్థిక శుభాకాంక్షలు తెలిపారు.