calender_icon.png 5 July, 2025 | 6:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి ఆధ్వర్యంలో ఘనంగా రోశయ్య జయంతి వేడుకలు

05-07-2025 12:17:55 AM

మందమర్రి,(విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మాజీ గవర్నర్  కొణిజేటి రోశయ్య జయంతి వేడుకలు సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జియం కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఏరియా జిఎం జి దేవేందర్  రోశయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంత రం జిఎం మాట్లాడుతూ కొణిజే టి రోశయ్య గుంటూరు జిల్లా, వేమూరులో జన్మించారని, గుంటూరు హిందూ కళాశాల, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి వాణిజ్య శాస్త్రంలో పట్టభద్రుడయ్యాడన్నారు.

ఆయన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చారని ఆయన తండ్రి రాజకీయాల్లో ఉన్నందున, రోశయ్య  రాజకీయాల్లోకి ప్రవేశించారని, 1968లో మొదటి సారి, 1974, 1980 లలో శాసనమండలి సభ్యుని గా ఎన్నికయ్యారని. ఆయన  సెప్టెంబరు 3, 2009 నుండి నవంబరు 24, 2010 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రిగా పనిచేశారనీ గుర్తు చేశారు. ఆర్థిక మంత్రిగా అనేక సంవత్సరాలు పనిచేసి, 15 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశ పెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఆర్థిక మంత్రిగా ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధికి ఆయన అనేక రకాలుగా సేవలు అందించా రని ఆయన సేవలను కొనియా డారు ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటు జిఎం విజయ్ ప్రసాద్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రెటరీ సలేంద్ర సత్యనారాయణ, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ శంకర్, ఏఐటియుసి స్ట్రక్చర్ కమిటీ మెంబర్ సివి రమణ, జిఎం కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.