calender_icon.png 3 September, 2025 | 12:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నెపల్లిలో బీఆర్ఎస్ నాయకుల నిరసన

02-09-2025 04:54:03 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): కన్నెపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పై ప్రభుత్వం విధించిన సిబిఐ విచారణలు పూర్తిగా వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కెసిఆర్ పై కక్షగట్టి ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువజన అధ్యక్షులు జిల్లెల్ల మహేష్ గౌడ్, మండల సీనియర్ నాయకులు ఆకుతోట రాజన్న, తలండి అశోక్, బండ గణేష్, దేవయ్య, సిహెచ్ రామన్న, సతీష్, శ్రీనివాస్, పలువురు మహిళా నాయకురాళ్ళు పాల్గొన్నారు.