calender_icon.png 2 September, 2025 | 11:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాశీ విశ్వనాథ ఆలయానికి 300 స్టీల్ ప్లేట్లు విరాళం

02-09-2025 04:26:40 PM

పర్యావరణహితం కోరుతూ ఉదారతను చాటుకున్న గ్రామానికి చెందిన తాసిల్దార్ పి రమణ. 

కుభీర్: నిర్మల్ జిల్లా కుబేర్ మండలం లోని పల్సి లోని శ్రీ కాశీ విశ్వనాథ ఆలయానికి అదే గ్రామానికి చెందిన తాసిల్దార్ పి రమణ మంగళవారం 300 స్టీల్ ప్లేట్లు ఆలయ కమిటీకి విరాళంగా అందజేశారు. తన అమ్మమ్మ కీ.శే.కండెల బుచ్చక్క స్మారకార్థం ఆలయంలో తరచూ జరిగే అన్నదాన కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని పేపర్ ప్లేట్లపై ఉండే ప్లాస్టిక్తో జరిగే అనర్థాలను దృష్టిలో ఉంచుకొని ఆలయంలో ప్లాస్టిక్ ప్లేట్లను పూర్తిగా నిషేధించాలన్న సంకల్పంతో ఆయన వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఈ ప్లేట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తాసిల్దార్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను అభినందించారు. ఇదిలా ఉండగా కుభీర్ కు చెందిన పుప్పాల సుభాష్ మరో 200 స్టీల్ ప్లేట్లు అందజేశారు. మొత్తం 500 స్టీల్ ప్లేట్ల విలువ సుమారు రూ. 25 వేలు ఉంటుందని తెలిపారు. దీంతోపాటు  వినాయక నిమజ్జనం రోజైన శనివారం రోజు అన్నదానం కోసం అయ్యే ఖర్చులు ఉప్పల సుభాష్ భరిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.