calender_icon.png 20 November, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శేరిలింగంపల్లిలో బీఆర్‌ఎస్‌లోకి చేరికలు

20-11-2025 12:57:26 AM

శేరిలింగంపల్లి, నవంబర్ 19(విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బుధవారం శేరిలింగంపల్లి బీఆర్‌ఎస్ ఇంచార్జి ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు సూచనలు, సలహా మేరకు, చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి ఆధ్వర్యంలో  కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ విమల్ కుమార్ ఇతర కాంగ్రెస్ నాయకులు  బీఆర్‌ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సంద ర్భంగా బొబ్బ నవత రెడ్డి మాట్లాడుతూ శేరిలింగంపల్లిలో అభివృద్ధి కుంటుపడింది, ప్రజలు సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నారని,ప్రజాప్రతినిధులు వారూ ఏ పార్టీలో ఉన్నారో వారికె తెలియని పరిస్థితిలో ప్రజ లు అయోమయంలో ఉన్నారన్నా రు. ప్రజా సమస్యలను గాలికి వదిలి వారి పదవులను కాపాడుకోవడానికి కృషి చేస్తున్నారని రాబో యే కాలంలో ప్రజల వ్యతి రేకతతో బీఆర్‌ఎస్‌లో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మిద్దెల మల్లారెడ్డి, సంగారెడ్డి, వాల హరీష్, పార్నం ది శ్రీకాంత్, రవీందర్ యాదవ్, గౌస్, బాబు మోహన్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.