calender_icon.png 25 October, 2025 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయ జీవితంలో తన స్వార్థం కోసమే పోచారం పార్టీలు మారుతారు

24-10-2025 11:54:30 PM

వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓట్లతో బుద్ధి చెబుతారు

ప్రకృతి సంపదను దోచుకోవడం కోసమే పార్టీలు మారుతూ సానుభూతి మాటలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుంది

కెసిఆర్ ప్రభుత్వంలోనే బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధి

బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్

బాన్సువాడ,(విజయక్రాంతి): రాజకీయ జీవితంలో తన స్వార్థం కోసమే పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీలు మారుతారని బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ రాష్ట్రంలో పది మంది బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి మారినప్పటికీ బిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నమని పేర్కొనడం సిగ్గుచేటు అన్నారు.

బాన్సువాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చాలా పదవులు అనుభవించి రాజకీయ జీవితంలో తన స్వార్థం కోసమే పార్టీలు మారాడని ప్రజలకు మాత్రం నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం పార్టీ మారానని సానుభూతి మాటలు చెబుతున్నప్పటికీ ప్రజలు మాత్రం నమ్మే స్థితిలో లేరని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో ప్రకృతి సంపదను దోచుకోవడం కోసమే పార్టీలు మారుతూ ఆర్థికంగా ఎదగడమే తప్ప ఆయన వెంట ఉన్న నాయకులు కార్యకర్తలను ఉన్నత స్థాయిలో జిల్లా రాష్ట్ర స్థాయిలో ఎదిగనివ్వకుండా ఆయన చేతుల్లోనే ఉంచుకోవడం జరుగుతుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలోనే రైతులు ప్రజలు అభివృద్ధి చెందారని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచిన ఏ ఒక్క రైతు గాని ప్రజలు గాని సంతోషంగా లేరని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారని ఆయన ఆరోపించారు.

అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలమైందని బాన్సు నియోజకవర్గం లో చాలామంది రైతులు అకాల వర్షానికి ధాన్యం తడిసి లబో దీపం అంటున్న వారిని పట్టించుకునే నాథుడు లేదని రైతులను మోసం చేయడం జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో గాని రాబోయే ఉప ఎన్నికల్లో గాని ప్రజలు ఓట్లతో బుద్ధి చెబుతారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పరిపాలన చాతకాక కేసీఆర్ కేటీఆర్ ల పై ప్రతిరోజు తిట్టడం రాజకీయ పబ్బం కడుక్కోవడమే జరుగుతుందని ప్రజలు రైతుల సంక్షేమాన్ని మర్చిపోవడం సీఎం రేవంత్ కి దక్కిందన్నారు. రాష్ట్రంలో దోపిడీ దొంగలుగా మంత్రులు మారారని ఎక్కడ ఏమి దొరికితే దోచుకోవడమే మంత్రుల పని అని ఆయన ఆరోపించారు.

పింఛన్లు కళ్యాణ లక్ష్మి రైతులకు బోనస్ రైతుబంధు రైతు బీమా కేసీఆర్ కిట్ వంటి అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోవడం ప్రజలను మోసం చేయడం జరుగుతుందన్నారు. వచ్చే ఉప ఎన్నికల్లో పదిమంది ఎమ్మెల్యేలకు డిపాజిట్ కూడా రావని ఆయన తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో పోచారంపై తాను పోటీ చేస్తానని పోచారంకు డిపాజిట్లు కూడా రావని గల్లంతవుతాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా దిగజారు రాజకీయాలు మానుకొని బాన్సువాడ నియోజకవర్గంలో ప్రజలు రైతుల సంక్షేమం కోసం కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జిగా కేసీఆర్ కేటీఆర్ లు తనను నియమించారని బాన్సువాడ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు.

బిఆర్ఎస్ అధికారంలోకి రాగానే బాన్సువాడ నియోజకవర్గంలో అక్రమాల పుట్టాను విప్పి వారిని విడిచి పెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. నియోజకవర్గంలో ఉద్యమకారులను అనగా తొక్కడం జరిగిందన్నారు. ఇప్పటికైనా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో ప్రజలకు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంతవుతుందని బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గం కెసిఆర్ ప్రభుత్వం లోనే అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ రైతుబంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, మాజీ జెడ్పిటిసి నార్ల రత్నకుమార్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, నాయకులు గణేష్ సాయిబాబా ఇషాక్ చందర్ మొగులయ్య రమేష్ యాదవ్, మౌలా సాయిలు తదితరులున్నారు.