calender_icon.png 30 August, 2025 | 9:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ తరలిన మాల మహానాడు నాయకులు

30-08-2025 02:32:25 PM

మందమర్రి,(విజయక్రాంతి): హైదరాబాదులో నిర్వహిస్తున్న జాతీయ మాల మహానాడు(Mala Mahanadu leaders) రాష్ట్ర కమిటీ సమావేశానికి జిల్లా మాల మహానాడు నాయకులు శనివారం తరలి వెళ్లారు. హైదరాబాద్ లోని బోరబండలో జరుగుతున్న రాష్ట్ర కమిటీ సమావేశానికి మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్ రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ లు ముఖ్య అతిథులుగా హాజరవు తున్నారని వారు తెలిపారు.

సమావేశాల్లో భవిష్యత్తు కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుందని నాయకులు తెలిపారు. కాగా తరలి వెళ్ళిన వారిలో మంచిర్యాల జిల్లా మాల మహానాడు అధ్యక్షులు గజ్జెల్లి లక్ష్మణ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నక్క శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాల్తపు శంకరయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి పైడిమల్ల నర్సింగ్, రాష్ట్ర నాయకులు బొజ్జ శరత్, జిల్లా కార్యదర్శి నాగుల దుర్గయ్య, జైపూర్ మండల అధ్యక్షులు శీలం వెంకటేష్, మందమర్రి పట్టణ అధ్యక్షులు దాసరి రామన్న, పట్టణ యూత్ అధ్యక్షులు దాసరి అనిల్, నాయకులు కోక్కల రమేష్ లు ఉన్నారు.