calender_icon.png 30 August, 2025 | 9:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

30-08-2025 02:31:56 PM

మాజీ మేయర్ సునీల్ రావు

కరీంనగర్ (విజయక్రాంతి): భక్తి శ్రద్దలతో గణేష్ నిమజ్జనాలను ప్రశాంత వాతావరణంలో నగర ప్రజలు జరుపుకోవాలని బీజేపి నాయకులు, నగర మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు(Former Mayor Yadagiri Sunil Rao) అన్నారు. కరీంనగర్లోని భగత్ నగర్ మాజీ మేయర్ క్యాంపు కార్యాలయంలో మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలందుకున్న మట్టి గణనాథుని ముందస్తు నిమజ్జన వేడుక ఘనంగా జరిగింది. మాజీ మేయర్ యాదగిరి అపర్ణ సునీల్ రావులు మట్టి గణపతికి చివరి పూజ చేసి... నిమజ్జనానికి తరలించారు. క్యాంపు కార్యాలయంలో పూజలు అందుకున్న మట్టి గణనాథుని కాలనీ వాసులు, యూత్ క్లబ్ సభ్యులు, క్యాంపు కార్యాలయ సిబ్బంది బ్యాండు మేలం, కోలాటాలు, వివిధ సంస్కృతిక నృత్యాలతో అంగరంగ వైభవంగా ఊరేగింపుగా తీసుకెల్లి మానేరు డ్యాంలో నిమజ్జనం చేశారు. అట్టహాసంగా సాగిన మట్టి గణనాథుని నిమజ్జనం వేడుకలు నగర ప్రజలందరిని ఆకట్టుకున్నాయి.

ఈ సంధర్బంగా మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ. మట్టి గణపతిని ప్రతిష్ఠించి పూజించడం మహా శ్రేష్ఠం అన్నారు. మట్టి గణపతులను ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విఘ్నాలు తొలగిపోయి...కోరిన కోర్కెలు తీరి మొక్షం లబిస్తుందని తెలిపారు. నగర ప్రజలు ప్రతిఏటా మట్టి గణపతులనే ప్రతిష్ఠించి పూజించాలని సూచించారు. ప్రస్తుతం మండపాల్లో ప్రతిష్ఠిస్తున్న ప్లాస్టర్ పారిస్ విగ్రహాలతో వాతావరణం కలుషితం చెంది జలచర జీవరాసులతో పాటు మానవాలికి మనుగడకు ప్రాణహాని కలిగిస్తున్నాయని తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరు మట్టి గణనాథులనే పూజించాలని కోరారు. నగర ప్రజలు గణేష్ నిమజ్జనాలను ప్రశాంత వాతావరణం లో జరుపుకోవాలన్నారు. మండపాల్లో ప్రతిష్ఠించిన విగ్నేశ్వర విగ్రహాలను భక్తి శ్రద్ధలతో పూజించి ప్రశాంత వాతావరణం లో నిమజ్జనాలు జరపాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌరిశెట్టి మనోహార్ రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్, భగత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, ఆదర్శయూత్ క్లబ్ సభ్యులు, చైతణ్యయూత్ క్లబ్ సభ్యులు, పెద్దమ్మ యూత్ క్లబ్ సభ్యులు, మహదేవా యూత్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.