calender_icon.png 30 August, 2025 | 9:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్ ను గ్రీన్ సిటీగా మార్చడమే లక్ష్యం

30-08-2025 02:34:40 PM

కరీంనగర్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం చేపతున్న వన మహోత్సవ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించాలని నగరపాలక సంస్థ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్(Commissioner Praful Desai) అన్నారు. కరీంనగర్ శనివారం రోజు కలెక్టరెట్ కార్యాలయ ఆవరణలో నగరపాలక సంస్థ ద్వారా నాటిన మొక్కలను పరిశీలించి... అధికారులు, సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేశారు. కలెక్టరెట్ కార్యాలయం ఆవరణలో ఖాళీ ప్రదేశం ఉన్న చోట మరిన్ని మొక్కలు నాటి వాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సంధర్బంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ.... కరీంనగర్ ను గ్రీన్ సిటీగా మార్చడమే లక్ష్యంగా నగరపాలక సంస్థ ద్వారా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో నగర వ్యాప్తంగా, డివిజన్ వారిగా మొక్కలను నాటి సంరక్షణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నగరపాలక సంస్థ ద్వారా నర్సరీలలో పెంచిన మెక్కలను ఇప్పటికే చాలా చోట్ల ఖాళీ ప్రదేశాలను గుర్తించి... యాదాద్రి, మియావాకీ, బ్లాక్ లుగా మొక్కలను నాటి సంరక్షణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అంతే కాకుండా నగరంలో చాలా చోట్ల పట్టణ ప్రకృతి వనులను, రాశీ వనాలను ఏర్పాటు చేసి మొక్కలను కాపాడటం జరుగుతుందని తెలిపారు. నగర ప్రజలు కూడ మీ ఇంటి పరిసరాల్లో ఖాళీ ప్రదేశాలు ఉన్న ప్రతి చోట పూలు, పండ్లు, జౌషద మొక్కలను నాటి సంరక్షించాలని సూచించారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటి పెంచడం ద్వారా వాతావరణ సమతుల్యత ఏర్పడి మానవాడి మనుగడ ఆరోగ్యంగా సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.