30-08-2025 02:37:56 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): బిఎస్ఎన్ఎల్(BSNL) సంస్థ సిమ్ కార్డులను ఒక రూపాయికే అందజేస్తూ నెలరోజుల వ్యాలిడిటీతో పాటు ప్రతిరోజు 2GB డేటా అన్లిమిటెడ్ కాల్ చేసుకునే అవకాశం ఇస్తుంది. దీంతో సిమ్ కార్డు తీసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. నెలరోజుల వ్యాలిడిటీ అనంతరం 199 రూపాయలు రీఛార్జ్ చేస్తే నెలరోజుల వ్యాలిడితో పాటు ప్రతిరోజు 2GB డేటా వస్తుందని బిఎస్ఎన్ఎల్ అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజనల్ ఇంజనీర్ భీమ్ శంకర్, సిబ్బంది సత్యనారాయణ, రాజానంద్, రవికుమార్, సిహెచ్ సత్యనారాయణ ఉన్నారు.