calender_icon.png 4 October, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సత్తా చాటాలి

04-10-2025 01:21:27 AM

చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ 

 బోయినపల్లి: అక్టోబర్ 3 ( విజయ క్రాంతి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్‌ఎస్ చెత్తాచెడాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం టిఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశానికి జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా నిర్వహించిన టిఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి టిఆర్‌ఎస్ అభ్యర్థులందరూ విజయం సాధించేలా కృషి చేయాలని ఆయన కోరారు. ప్రతి నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఇంటింటికి వెళ్లి వివరించాలని కోరారు. ప్రస్తుతం ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని విధాలుగా వ్యతిరేకత ఉన్నారని చెప్పారు.

అందుకు నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషిచేసి టిఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపునకు కృషాల నాయన కోరారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సత్తినేని మాధవ్, మండల టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, టిఆర్‌ఎస్ సీనియర్ రాష్ట్ర నాయకులు చెన్నాడి అమిత్ కుమార్, మాజీ జెడ్పిటిసి కొనుకటి లచ్చిరెడ్డి మరియు మండల నాయకులు ముద్దం రవీందర్, తదితరులు పాల్గొన్నారు.