calender_icon.png 4 October, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాచారం ఇన్‌స్పెక్టర్‌ను కలిసిన నవజ్యోతి యూత్ క్లబ్

04-10-2025 01:16:25 AM

ఉప్పల్, అక్టోబర్ 3(విజయక్రాంతి) : నూతనంగా బాధ్యతలు చేపట్టిన నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ్ గౌడ్ ను మల్లాపూర్ నవజ్యోతి యూత్ నాయకులు జింక నవీన్ ఆధ్వర్యంలో కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం ఈనెల ఐదున నవజ్యోతి యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన దుర్గామాత నిమర్జనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రావాలని కోరారు.

ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ధనుంజయ గౌడ్ మాట్లాడుతూ స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా నిమజ్జ కార్యక్రమం నిర్వహించుకోవాలని యూత్ నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య ప్రభాకర్ రెడ్డి యూత్ నాయకులు  శ్రావణ్ కుమార్ గౌడ్ అజయ్ షారుక్ తదితరులు పాల్గొన్నారు