9 May, 2026 | 11:28 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

కవిత ఎపిసోడ్‌తో బీఆర్‌ఎస్‌కు నష్టమే

26-05-2025 01:38 AM

-ఇది కాంగ్రెస్ అలర్ట్‌గా ఉండాల్సిన సమయం

- పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి 

హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): కేసీఆర్ కుటుంబ పంచాయతీ రాజకీయంగా వాళ్లకు నష్టం జరుగుతుందని, పార్టీ కేడర్  నిరూత్సాహంతో బీజేపీ వైపు వెళ్లే ప్రమాదం ఉందని  పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు.

ఇలాంటి స్థితిలో కాంగ్రెస్ అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉందని, బీఆర్‌ఎస్ శ్రేణులను కాంగ్రెస్ వైపు తెచ్చుకునే ప్రయత్నం చేయాలని అభిప్రాయ పడ్డారు. ఈ విషయాన్ని సమయం వచ్చినప్పుడు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్  మీనాక్షినటరాజన్‌తో పాటు సీఎం రేవంత్, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.

కేసీఆర్‌తోనే  బీఆర్‌ఎస్‌కు ఉనికి ఉంటుందని.. కేటీఆర్, హరీష్, కవిత వల్ల ఏమి కాదన్నారు. కవిత స్వతహాగా లీడ ర్ కాదన్నారు. కేసీఆర్‌ను కవిత  దేవుడు అం టూనే.. ఆయన రాజకీయ జీవితాన్ని సమాధి చేస్తోందని, కూర్చున్న చెట్టునే నరికేస్తుందని దుయ్యబట్టారు. కవిత ఎపిసోడ్‌తో బీఆర్‌ఎస్‌కు నష్టపోనుందని, బీజేపీ లాభపడే అవకాశాలున్నాయన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉండ గా, రెండో స్థానంలో బీఆర్‌ఎస్, మూడో స్థానంలో బీజేపీ ఉన్నాయన్నారు. తెలంగాణలో ఎన్నికలకు మూడేళ్ల సమయం ఉంద ని, అన్ని రాజకీయ పార్టీలలో అంతర్గత కలహాలు ఉండటం సహజమేనని పేర్కొన్నారు. 

రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్‌కు పదేళ్లు బీఆర్‌ఎస్‌కు ప్రజలు అధికారం ఇచ్చారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా పదేళ్లు అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు. బీజేపీ ఎల్లప్పుడు మతం పేరుతో రాజకీ యం చేస్తోందని మండిపడ్డారు.