06-11-2025 12:00:00 AM
-పంజాబ్‌లో బిష్ణోయ్ గ్యాంగ్ ఘాతుకం
చండీగడ్, నవంబర్ 5: పంజాబ్‌లోని లుథియానాలో సోమవారం ఓ కబడ్డీ క్రీడాకారుడు దారుణ హత్యకు గురయ్యాడు. లుథియానా జిల్లాలోని సమ్రలా బ్లాక్‌లో కబడ్డీ ఆటగాడు గుర్వీందర్‌సింగ్‌ను దుండగులు కాల్చి చంపా రు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అన్మోల్ బిష్ణోయ్ పేరిట సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
గుర్వీందర్ సింగ్‌ను తమ గ్యాంగ్‌కు చెందిన కరణ్, తేజ్‌చక్ హత్యచేసినట్లు అందులో పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల కెనడాలో హత్యకు గురై న భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త దర్శన్‌సింగ్ సహాసినిని తామే చంపినట్లు ఇటీవల బిష్ణోయ్ గ్యాంగ్ అంగీకరించింది. కెనడాలోని పంజాబీ గాయకుడు చానినట్టన్ ఇంటి వెలుపల జరిగిన కాల్పులకు కూడా బాధ్యత వహించింది.
కాగా అక్టోబర్ 31న లుథియానాకు చెందిన 26ఏళ్ల కబడ్డీ ఆటగాడు తేజ్‌పాల్ సింగ్ హత్యకు గురయ్యాడు. తేజ్‌పాల్ స్నేహితులే అతడిని హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. పంజాబ్‌లో వరుసగా జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.