calender_icon.png 8 November, 2025 | 12:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాటర్ బాటిల్ రూ.100, కాఫీకి రూ.700

06-11-2025 12:00:00 AM

-సినిమా హాళ్లపై సుప్రీం కోర్టు ఆగ్రహం

-ధరలు నియంత్రంచకపోతే సినిమా హాళ్లు ఖాళీ

-జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం హెచ్చరిక

న్యూఢిల్లీ, నవంబర్ 5: ‘మీరు ఒక వాటర్ బాటిల్‌కు రూ.100, కాఫీకి రూ.700 వసూ లు చేస్తున్నారు.. మంచినీళ్ల బాటిల్, కాఫీ వంటి అత్యంత సాధారణ వస్తువుల ధరలు కూడా అపహాస్యం కలిగించేలా ఉన్నాయి.. ధరల నియంత్రణ లేకపోతే ప్రేక్షకులు దూరమై సినిమా హాళ్లు నిర్మానుష్యంగా మారవచ్చు’ అని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

కర్ణాటక ప్రభుత్వం చలనచిత్ర టికెట్ ధరలను రూ.200కు పరిమితం చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం పలు హెచ్చరికలు జారీ చేసింది. మల్టీప్లెక్స్ల్‌లో కేవలం సినిమా టికెట్లే కాదు, లోపల విక్రయించే పాప్కార్న్, కూల్ డ్రింక్స్, కాఫీ వంటి స్నాక్స్ ధరలు కూడా సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఒక సినిమా చూసేందుకు సగటున రూ.1,500 నుంచి రూ.2,000 వరకు ఖర్చవుతున్న నేపథ్యం లో, ఈ అధిక ధరలపై మల్టీప్లెక్స్లు చాలా కా లంగా విమర్శలు ఎదుర్కొంటున్నాయి. 

మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ వాదిస్తూ, ‘తాజ్ హోటల్ కాఫీకి రూ.1,000 వసూలు చేస్తుంది దానిని మీరు నిర్ణయించగలరా? ఇది ఎంపిక చేసుకునే విషయం’ అని అన్నారు. దీనికి స్పందించిన జస్టిస్ నాథ్ ‘ఈ ధరలను పరిష్కరించాలి. సినిమా రంగం క్షీణిస్తోంది. ప్రజలు వచ్చి ఆనందించేందుకు వీలుగా ధరలను మరింత సహేతు కంగా మార్చండి, లేదంటే సినిమా హాళ్లు ఖా ళీగా మిగులుతాయి‘ అని హెచ్చరించారు.