23-11-2025 07:30:11 PM
జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారి రంగ వెంకటేశ్వర్ గౌడ్
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఆదివారం కామారెడ్డి జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 10 కిలోమీటర్ల పరుగు పందెంలో 45+50 వయసు కేటగిరీలో గెరిగంటి లక్ష్మినారాయణ (కామారెడ్డి అర్బన్) 10 కిలోమీటర్ల దూరాన్ని 46 నిమిషాల్లో పూర్తి చేసి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించి గోల్డ్ మెడల్ సాధించారని జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారి రంగ వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు.
10 కిలోమీటర్ల దూరాన్ని 48 నిమిషాల్లో కంప్లీట్ చేసి 45+50 వయసు కేటగిరిలో 2వ స్థానంలో దండబోయిన నరేందర్ ( రామారెడ్డి ) రిటైర్డ్ ఆర్మీఉద్యోగి మోడల్ సాదించారు.10 కిలోమీటర్ల కేటగిరిలో 10 కిలోమీటర్ల దూరాన్ని 48 నిమిషాల్లో పూర్తి చేసి 35+40 వయసు కేటగిరీల్లో దర్మగోని రంజీత్ గౌడ్ ( చిన్న మల్లారెడ్డి) పోలీస్ కానిస్టేబుల్ ప్రథమ స్థానం సాధించి గోల్డ్ మోడల్ సాదించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు జైపాల్ రెడ్డి, రంజిత్ మోహన్, అనిల్ కుమార్,దత్తాద్రిరావు, ఫిజికల్ డైరెక్టర్, పీఈటీలు, తదితరులు పాల్గొన్నారు.