23-11-2025 07:37:23 PM
బిచ్కుంద (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ఆదివారం మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ... మహిళల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన, సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న చర్యలను కొనియాడారు. ఇందిరమ్మ మహిళా శక్తి పథకం ద్వారా పేద, మధ్యతరగతి మహిళలకు అండగా నిలవడమే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో సోసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ ముగ్డే వార్ బస్వంత్ రావ్ సోమావార్ మహేష్ కాంగ్రెస్ నాయకులు పాలుగోన్నారు.