23-11-2025 07:27:20 PM
నకిరేకల్ (విజయక్రాంతి): ఎన్ సి సి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం స్థానిక ఏబీఎన్ పాఠశాలలో ఎన్ సి సి విద్యార్థులతో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో విద్యార్థులు దేశభక్తి, ఎన్ సి సి గొప్పతనం గురించి నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. అనంతరం పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కందాల స్వప్న శ్రీకాంత్ రెడ్డి, ఎన్ సి సి ఏఎన్ఓ నిమ్మల శంకర్ గౌడ్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.