calender_icon.png 23 November, 2025 | 7:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాచీన దేవాలయాలను పరిరక్షించాలి

23-11-2025 07:33:39 PM

కట్టంగూర్ కోఆపరేటివ్ మేనేజర్ ఉప్పల రవీందర్ కుమార్..

నకిరేకల్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో వేల ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాచీన దేవాలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైఉందని కట్టంగూర్ కోఆపరేటివ్ మేనేజర్ ఉప్పల రవీందర్ కుమార్ అన్నారు. ఆదివారం శాలిగౌరారం మండలం ఆకారంలో గ్రామంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని పలువురు ప్రముఖులు పరిశీలించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెయ్యేళ్ల సూర్యదేవాలయం చోళ, కాకతీయ, శాతవాహనుల, విష్ణుకుండుల శిల్పకళల సమ్మేళనంగా నిలిచిందన్నారు. సూర్యదేవాలయ పునర్మించాలని, దూప దీప నైవేద్యాలను కొనసాగించాలని కోరారు. పురావస్తు, దేవాదాయశాఖల సమన్వయంతో ఆలయానికి పూర్వవైభవం తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో యుఎన్ఓ కౌన్సిల్ మెయిర్ అదోని వెంకటరమణ, సీనియర్ జర్నలిస్ట్ సురేష్, ప్రొఫెసర్ శ్రీకాంత్, మంగారెడ్డి, రమేష్, సందీప్, తదితరులు పాల్గొన్నారు.