23-11-2025 07:31:52 PM
పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలం కాటేపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలకు ఆదివారం ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని తెలిపారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించిందని తెలిపారు. డ్వాక్రా మహిళలకు 10 లక్షల ప్రమాద బీమా, ఇందిరమ్మ ఇళ్ల మంజూరి, డ్వాక్రా గ్రూప్ లబ్ధి దారులు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపడితే రెండు లక్షల వరకు రుణ సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు అందించడం జరుగుతుందని తెలిపారు.
కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలు కొనసాగించడం జరుగుతుందని తెలిపారు. డ్వాక్రా మహిళలు సహజ మరణం పొందితే అప్పటి వరకు ఉన్న రుణం మొత్తం మాఫీ చేయడం జరుగుతుందని తెలిపారు. సంక్షేమ పథకాలు అందని వారు డిసెంబర్ 1నుండి 9వరకు జరిగే ప్రజా పాలన లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపిఓ, విఓఏ సంతోష్ గౌడ్, మండల కాంగ్రెస్ నాయకులు మహేందర్ రెడ్డి,కాటేపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహిద్దిన్ పటేల్, నాయకులు మల్లప్ప పటేల్, శ్యామప్ప, గంగా గౌడ్, ఆకుల పర్వయ్య, మొగలా గౌడ్,ఇస్మాయిల్ పటేల్,అశోక్,రవీందర్,సాయిలు, శంకర్,చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.