17-05-2025 12:27:37 AM
కరీంనగర్ క్రైం,మే16(విజయక్రాంతి): కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం శుక్రవారం నాడు కరీంనగర్ బస్టాండులోని ప్రజల భద్రత కోసం ఏర్పాటు చేసిన పోలీస్ అవుట్ పోస్ట్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమీషనర్ విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందితో మాట్లాడి వారి పనితీరును అడిగి తెలుసుకున్నారు. బస్టాం డ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు.
అవుట్ పోస్ట్లోని సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండా లని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. అనంతరం అవుట్ పోస్ట్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన కమీషనర్, బస్టాండ్ ఆవరణలో నిరంతరం ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశిం చారు. ప్రజల భద్రతకు పెద్దపీట వేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా ఉంచాలని సిబ్బందికి సూచించారు.