17-05-2025 12:26:07 AM
డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
కడ్తాల్, మే 16 : కడ్తాల్ మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్ ఆధ్వర్యంలో మాజీ గవర్నర్ చెన్న కిషన్ రెడ్డి సహకారంతో కొనసాగుతున్న రాగి అంబలి ఉచిత పంపిణీ కార్యక్ర మంలో భాగంగా శుక్రవారం డీసీసీ అధికార ప్రతినిధి గుడూరు శ్రీనివాస్ రెడ్డి తల్లితండ్రులైన గూడూరు పుష్పమ్మ నారాయణ రెడ్డి జ్ఞాపకార్ధంగా ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ యాట గీతా నరసింహ, వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, తహశీల్ధార్ ముంతాజ్ బేగం, ఎంపీడీవో సుజాత మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, లయన్స్ క్లబ్ మిత్రులతో కలిసి ఉచి త రాగి అంబలి ప్రసాదం పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు.
ఈ సందర్భంగా డిసిసి అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ అమనగల్ సేవలు అభి నందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి భీఖ్యా నాయక్, గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు హన్మా నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ, మం డల పార్టీ అధ్యక్షులు లయన్ బీచ్యా నాయక్, సేవాదల్ అధ్యక్షులు, లయన్ లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరేష్, రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి క్యామ రాజేష్, నాయకులు జాంగిర్ అలీ, మాలే మల్లేష్, కృష్ణ, బిక్షపతి, మల్లయ్య, శేఖర్, నరేందర్, వెంకటయ్య, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు షాబుద్దీన్, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.