25-08-2025 11:36:30 PM
యాదాద్రి భువనగిరి,(విజయక్రాంతి): సికింద్రాబాద్ లోని రైల్ నిలయంలో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్, వాస్తవ ని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల్ కిరణ్ కుమార్ రెడ్డి కలిసారు. ఘట్కేసర్ నుండి యాదాద్రి భువనగిరి ఎంఎంటీఎస్ రైలు భూ సేకరణ కోసం యాదాద్రి కలెక్టర్ మరియు మేడ్చల్ కలెక్టర్ గార్లతో ఫోన్ లో మాట్లాడారు.
భువనగిరి నుండి యాదాద్రి(రాయిగిరీ) పనులు మొదలయ్యాయి వీటిని త్వరితగతిన పనులు పూర్తి చేసి యాదాద్రికీ వచ్చే భక్తులకు మరియు అప్ అండ్ డౌన్ కార్మికుల కష్టాలు తీరుతాయన్నారు. రామన్నపేటలో ఫలక్నామా, శబరి, నారాయణాద్రి ఎక్స్ప్రెస్ లో హాల్టింగ్ గురించి చర్చించారు దినికి రైల్వే మేనేజర్ సనుకూలంగా స్పందించారు.