calender_icon.png 26 August, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ డీలర్లకు కమిషన్ విడుదల చేయాలి

25-08-2025 11:32:55 PM

కోరుట్ల,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో రేషన్ డీలర్లకు ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కమిషన్  విడుదల చేయాలని సోమవారం జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండల రేషన్ డిలర్ లు మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ ప్రసాద్ కు వినతిపత్రం సమర్పించారు. డీలర్లు 2025 ఏప్రిల్ మే నెల వారి బియ్యం పంపిణీ చేయడం జరిగిందని,

ఆ తర్వాత 2025 జూన్ జూలై  ఆగస్టు మూడు నెలల బియ్యం ప్రజలకు ప్రభుత్వ ఆదేశాల అనుసారంగా ఉదయం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అత్యంత పారదర్శకంగా పంపిణీ చేశామని,ప్రభుత్వం గత ఆరు నెలలుగా రేషన్ డీలర్లకు రావలసిన కమిషన్ ను విడుదల చేయడం లేదని,ఏ నెల కమిషన్ ను అదే నేలలోనే డీలర్ల ఖాతాలో జమ చేయలని కోరారు. డిలర్ కమిషన్ సకాలం లో రాక  తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వినతి పత్రం  సమర్పించారు.