calender_icon.png 26 August, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాకతీయ మెగా టెక్స్ట్సైల్ పార్క్ నుండి వరంగల్ బస్టాండ్ కు నూతన బస్ సర్వీస్

25-08-2025 11:28:47 PM

వరంగల్,(విజయక్రాంతి): సోమవారం వరంగల్ బస్టాండ్ నుండి కాకతీయ మెగా టెక్స్ట్సైల్ పార్క్ వరకు ఆర్టీసీ బస్సు సేవలను వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద తో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వయా ఊకల్ హవేలీ, కోనేమాకుల, ధర్మారం, జాన్ పీర్, వరంగల్ బస్టాండ్ మీదుగా వెళ్తుందని అన్నారు. టెక్స్టైల్ పార్క్లో పనిచేస్తున్న కార్మికులు, సిబ్బందితో పాటు సమీప గ్రామ ప్రజలకు బస్ సర్వీస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మహిళల సంక్షేమానికి కృషి చేస్తున్నదని, ఉచిత బస్సు సర్వీస్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడితేనే పరిశ్రమల అభివృద్ధి  అన్నారు. ఇండస్ట్రీ విజయవంతం కావాలంటే ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ప్రజా అవసరాల మేరకు రవాణా శాఖతో చర్చించి బస్ సర్వీస్ ఏర్పాటు చేస్తామని, భవిష్యత్తులో మరిన్ని మార్గాల్లో కొత్త బస్సులను అందించే దిశగా కృషి చేస్తామని అన్నారు.