calender_icon.png 20 August, 2025 | 6:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగ రక్షణకు గ్రామ గ్రామాన బస్సు యాత్ర

20-08-2025 01:48:20 AM

ఖైరతాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి) : రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ గ్రామాన బస్సు యాత్ర నిర్వ హిస్తామని అఖిల భారత ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ సంఘాల సమై క్య రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వర రాజ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమైక్య కన్వీనర్ కృష్ణ కేతావత్, అడ్వైజర్ ఆనంద్ లతో కలిసి మాట్లాడారు..

ఆర్‌ఎస్‌ఎస్ స్థాపించి సెప్టెంబర్ 25 నాటికి 100 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా భారతదేశంలో రాజ్యాంగాన్ని మార్చి మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావాలనే కుట్ర బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ లు చేస్తున్నాయని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పదివేల 955 గ్రామాలలో బస్సు యాత్ర నిర్వహించి రాజ్యాంగ ప్రాముఖ్యత, అంబేద్కర్ ఫూలే ల జీవిత చరిత్ర పుస్తకాలను ప్రజలకు అందించి  వారిని చైతన్య పరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమైక్య ప్రతినిధులు సుశీల కుమారి, రమణ, చంద్రప్రభ తదితరులు పాల్గొన్నారు.