calender_icon.png 5 September, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శోభాయాత్రకు పటిష్ట భద్రత

05-09-2025 12:00:00 AM

  1. ఇందూరులో 1300 సిబ్బందితో భారీ ఏర్పాట్లు
  2. డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ 200 సీసీ కెమెరాలు ఏర్పాట్లు

నిజామాబాద్ సెప్టెంబర్ 4: (విజయ క్రాంతి): నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ లలోని అన్ని గణేష్ నిమజ్జనోత్సం శోభయాత్ర సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నిజామాబాద్ సిపి సాయి చైతన్య తెలిపారు. ఒక వర్గానికి చెందిన ప్రాంతం గుండా నిజామాబాద్ నగర గణేష్ నిమజ్జన కార్యక్రమం జరగనున్న దృశ్య సునీత ప్రాంతాలలో గట్టి బంధం పోలీసులు ఏర్పాటు చేశారు. 

నిజామాబాద్ పోలీస్  కమిషనర్ సాయి చైతన్య, బందోబస్తు కార్యక్రమానికి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వినాయక  ఉత్సవాలు మొదలుకొని నిమజ్జనం శోభాయాత్ర వరకు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. గతంలో నిజామాబాద్ బైంసా నిర్మల్ బోధనలలో చిలరైన అల్లర్ల దృష్ట్యా మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లను నిజామాబాద్ పోలీసులు చేపట్టారు.   

గణేష్ నిమజ్జనోత్సవ శోభయాత్ర శాంతియుతంగా సజావుగా నిర్వహించేదుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, అన్ని డివిజన్ పరిధిలలో ప్రధాన నిమజ్జన మార్గాల్లో దాదాపు 1300 మందికి పైగా పోలీస్ సిబ్బందిని నియమించామని, సి.సి కెమెరాల ద్వారా నిఘా డ్రోన్ కెమెరాలలతోపర్యవేక్షణ, ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాట్లు పోలీస్ సిబ్బందితో పాటు ఎక్సైజ్ శాఖ, ఫారెస్టు శాఖ,  ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్ మొదలగు వారితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. వినాయక నిమజ్జన శోభాయాత్ర జరిగే ప్రాంతాలలో 200 కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటుతోపాటు డ్రోన్ కెమెరాలను కూడా ఉపయోగించనున్నారు.

మేరకు ఏర్పాట్లు కెమెరాలు బిగించడం పూర్తయింది. సంఘవిద్రోశక్తులు గతంలో రౌడీ శీటర్లుగా ఉన్న వారిపై పోలీసులు గట్టిగా పెట్టారు. వినాయకుల శోభాయాత్ర పై రాళ్లు నువ్వే పరిస్థితిని దీటుగా ఎదుర్కొనడానికి ఆయా ప్రాంతాల్లో సంబంధిత స్థానిక నాయకులతో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. గత ఐదు రోజుల నుండి గణపతుల నిమజ్జన కార్యక్రమం మొదలయ్యింది.

ప్రధాన నిమజ్జన కార్యక్రమం వచ్చే శనివారం జరగనున్న దృశ్య జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసింది జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సిపి సాయి చైతన్య నిమజ్జ నా స్థలాలను పరిశీలించి ఏర్పాటు చేయాల్సిందిగా స్థానిక ఇబ్బందులకు తాసిల్దారులకు ఆదేశాలు ఇచ్చారు. వినాయకుని శోభాయాత్రలో దాదాపు 1,300 మంది పోలీసు సిబ్బందితో శుభయాత్ర దారి పొడవునా బందోబస్తు  ఏర్పాటు చేశారు.

నిమజ్జన ఊరేగింపులో శాంతియుతంగా పాల్గొనాలని అనుమానస్పద వ్యక్తులు, వస్తువులు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వలని నిజామాబాద్ సిపి సాయి చైతన్య స్థానికులను కోరారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఏర్పాటుచేసిన ట్రాఫిక్ నియమాలు అందరూ పాటించాలని ఆడియో సిస్టమ్స్ నిర్ణీత స్థాయిలో ఉపయోగించాలని ఆయన సూచించారు.

వినాయక శోభాయాత్రలో డి.జే లు పూర్తిగా నిషేధం విధించినట్టు ఆయన తెలిపారు. ప్రజలు ఎటువంటి ‘ పుకార్ల ను నమ్మ వద్దని పుకార్లకు పాల్పడే అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని సిపి హెచ్చరించారు. మద్యం సేవించి ఊరేగింపులో పాల్గొనడం తప్పని మద్యం సేవించి ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా వివరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

అత్యవసర సమయంలో సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు:100 డయల్ చేయాలని లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్: 87126-59700* సంబంధిత పోలీస్ స్టేషన్ వారిని సంప్రదించగలరు ప్రజలందరూ ఈ గణేష్ శోభయాత్రను  ప్రశాంతంగా నిర్వహించుకోవాలని నిజామాబాద్ కోరారు.