calender_icon.png 7 September, 2025 | 8:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇచ్చిన హామీలను అమలు చేయాలి

05-09-2025 12:02:42 AM

కామారెడ్డి, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి) : కామారెడ్డి జిల్లాలోని బీడీ కార్మికులందరికీ ఎలాంటి షరతులు లేకుండా జీవన భృతి, బీడీ కార్మికుల పిఎఫ్. ఉన్నవారందరికీ జీవన భృతి మంజూరు చేయాలని. సిఐటియు జిల్లా నాయకులు సురేష్ గొండ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

బీడీ కార్మికులకు కామారెడ్డి ఎన్నికల డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఒక్క బీడీ కార్మికులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు, జీవన భృతి, ఆరోగ్య కార్డు లు, మంజూరు చేయాలని. బీడీ కార్మికులందరికీ 22 రోజులు పని కల్పించే విధంగా బీడీ కార్ఖానా యజమాన్యానికి ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సురేష్ గొండ విజ్ఞప్తి చేశారు. ఇచ్చిన హామీని అమలు చేయకుంటే బీడీ కార్మికులతో కలిసి దశల వారి పోరాటం చేయవలసి వస్తాదని సురేష్ గొండ తెలిపారు.