08-05-2025 12:32:41 AM
నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు బూడిదైన 10 ఎకరాల వరిగడ్డి
గోపాలపేట మే 7: రైతుల పొలాల్లో సాగు నీరు వేసుకుని పైపులైన్లు బోరు మోటర్ కేబుల్ అగ్నికి ఆహుతైన సంఘటన బుధవారం వనపర్తి జిల్లా గోపాలపేట మండలం బుద్ధారం గ్రా మంలో చోటుచేసుకుంది . అగ్ని ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బుద్ధారంగ్రామానికి చెందిన రైతులుబొగ్గు కుర్మయ్య, కావలి బాలయ్య, లంబాడి బాల్య, సంఘం కృ ష్ణయ్య,నాగిశెట్టి నరసింహ అనే రైతుల పొలాల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఓరి కొయ్యలకు నిప్పంటించారు.
దీంతో బోర్ కేబుల్,కేసింగ్ పూర్తిగా కాలిపోయాయి. పంట పొలాలకు నీరు పె ట్టేందుకోసం భూమిపై పరిచిన 600 ఫీట్ల పైపు లైన్ అగ్ని ప్రమాదానికి కాలిపోయిందని రైతు లు తెలిపారు.గుర్తు తెలియని వ్యక్తులు వరి కొయ్యలనకు నిప్పు అంటించడంతో దాదాపు పది ఎకరాలలో ఉన్న వరి గడ్డి, తో పాటు బోర్లు కేసింగ్ లు, బోర్ కేబుల్ పైపులు అన్ని కాలి 50 వేల నష్టం జరిగిందని ఆ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు . ప్రభుత్వం అందించి నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కోరారు.