calender_icon.png 30 July, 2025 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నుల్లో నింపే వీలుందా..

29-07-2025 12:13:28 AM

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా ‘తెలుసు కదా’. ప్రముఖ స్టుటైలిస్ట్ నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలు. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ‘మల్లికా గంధ..’ పేరుతో తొలి గీతాన్ని విడుదల చేశారు.

హైదరాబాద్ సమీపంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మూవీ టీమ్ ఈ సాంగ్‌ను లాంచ్ చేసింది. ‘ఆకాశం అందిందా.. నేలంతా నవ్విందా.. ఉన్నట్టుండేదో మారిందా.. ఎంతెంత చూస్తున్నా.. ఇంకాస్త లోతుందా..

కన్నుల్లో నింపే వీలుందా..’ అంటూ కవితాత్మకంగా సాగుతోందీ పాట.  తమన్ సంగీత సారథ్యంలో స్వర రూపం దాల్చిన ఈ గీతానికి కృష్ణకాంత్ సాహిత్యం అందించగా, సిధ్ శ్రీరామ్ ఆలపించారు. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 17న విడుదల కానుంది.