calender_icon.png 31 July, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లేడీ డాన్ సాహసాల లోకాః

29-07-2025 12:12:13 AM

కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన తాజాచిత్రం ‘లోకాః : చాప్టర్ వన్ సూపర్ ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో నస్లెన్, సాండీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డొమినిక్ అర్జున్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ సొంత నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. సోమవారం దుల్కర్ పుట్టిన రోజు కావటంతో ఈ మూవీ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. ముఖ్యంగా కథానాయకి కల్యాణి ప్రియదర్శన్ లుక్ ఇందులో విభిన్నంగా సూపర్ హీరోలా ఉంది. పోలీసులు అరెస్ట్ చేసి తన పేరును అడగ్గా.. ‘చంద్ర’ అని చెప్తుంది. ఓ గుహలో నుంచి పారిపోతున్న పాపను కథానాయకి యోధురాలిగా వచ్చి కాపాడుతుంది.

ఎవరికి కష్టం వచ్చినా, లేడీ డాన్‌లా వారికి సహాయం చేస్తుంది. ఈ సినిమాను ఓనమ్ పండుగ కానుకగా తమిళ, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్; డీవోపీ: నిమిష్ రవి; యాక్షన్: యానిక్ బెన్; ఎడిటర్: చమన్ చక్కో.