calender_icon.png 2 June, 2025 | 8:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గద్దర్ ఫిలిం అవార్డులను రద్దు చేయండి

31-05-2025 12:00:00 AM

తెలంగాణ సినిమా వేదిక(టీసీవి) డిమాండ్

ముషీరాబాద్, మే 30 (విజయ క్రాంతి) : ఆంధ్ర పెద్దల కనుసనల్లో జరిగిన తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులను వెంటనే రద్దు చేసి, కమిటీ వేసి తెలంగాణ సినిమాలకె గద్దర్ ఫిలిం అవార్డులు ఇవ్వాలని తెలంగాణ సినిమా వేదిక(టీసీవి) డిమాండ్ చేసింది.

శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో  తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో గద్దర్ పేరిట ప్రకటించిన అవారడ్స్ అంశంపై తె లంగాణ సినిమా వేదిక కో కన్వీనర్ మోహన్ బైరాగి అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో టిసివి గౌరవాధ్యక్షులు తుమ్మల ప్రాపుల్ రామ్ రెడ్డి, సినీ దర్శకులు ఎండి రఫీ, సీనియర్ జర్నలిస్ట్ స్కై బాబా, టిసివి రాష్ట్ర కన్వీనర్ లారా, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు సుధాకర్ తదితరులు మాట్లాడారు.

2014 నుంచి చేసిన అవార్డుల ఎంపిక సరైంది కాదన్నారు. సినిమా అవార్డు ఎంపికలో ఆంధ్రా వాళ్ళు ఉండడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. తెలంగాణ కవులు కళాకారులు, సినిమా రచయిత లు, ఆర్టిస్టులు అందరూ తెలంగాణ సినిమాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించా లని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్లు అవుతున్నా ఇప్పటివరకు తెలంగాణ సినిమా రంగం విభజన జరగలేదన్నారు.

తెలంగాణ ఫిలిం ఛాంబర్ కు కోరలు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సినిమాకు జరుగుతున్న అన్యాయం గురించి సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోతే తగు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మురళీధర్ దేశపాండే, పంజాలా శ్రవణ్ గౌడ్, రవి, హరి, అరుణ, సుజి, ప్రసాద్, బాలు నాయక్ నర్సిమారెడ్డి పాల్గొన్నారు.