09-05-2025 01:20:35 AM
మేడ్చల్, మే 8 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ భాష కాలనీలో ఆటోలో గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని ఎస్‌టీఎఫ్ టీం పట్టుకుంది. ఆటో యజమాని షేక్ సమీదు వద్ద కిలో గంజా యి స్వాధీనం చేసుకున్నారు.
షేక్ సమీద్ ను అరెస్టు చేసి, ఈ కేసుతో సంబంధం ఉన్న మహమ్మద్ రహీంపై కేసు నమోదు చేశామని ఎస్‌టీఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు. గంజాయి, ఆటో, నిందితుడు షేక్ సమీద్‌ను కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించామని తెలిపారు.