09-05-2025 01:21:12 AM
కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి, మే 8 (విజయక్రాంతి) : జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరి టాయిలెట్స్ నిర్మించాలనీ జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు. పంచాయతీ రాజ్,జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ,మిషన్ భగీరథ,విద్య,వైద్య ఆరోగ్య,మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులతో కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అధికారులతో గురువారం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టాయిలెట్స్ లేని పాఠశాలల్లో నెల రోజుల్లో తప్పని సరిగా నిర్మించాలన్నారు. విద్యార్థులు 40 మంది అబ్బాయిలకు ఒక టాయిలెట్,30 అమ్మాయిలకు ఒకటి టాయిలెట్ లెక్కన విద్యార్థుల సంఖ్య ప్రకారం నిర్మించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో వంట గది, ప్రహరీ గోడ నిర్మాణం చేయాలన్నారు. గ్రామాల్లో సీసి రోడ్లు పూర్తి చేయాలని, గురుకుల పాఠశాల, కళాశాలలో వాటర్ ట్యాంక్ ను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
గురుకుల విద్యా సంస్థలకు , అంగన్వాడి కేంద్రాలకు మిషన్ భగీరథ నీరు తప్పని సరిగా సరఫరా చేయాలన్నారు. గ్రామాల్లో అంగన్వాడి కేంద్రాల భవనాలు నిర్మించాలన్నారు. అంగన్వాడి అధికారులు అంగన్వాడి కేంద్రాలను సందర్శించి తనికి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్ర శేఖర్, జడ్పీ సీఈవో జానకి రెడ్డి పంచాయతీ అధికారి సాయి బాబా, పిడి డిఆర్డిఏ జ్యోతి వైద్య అధికారినీ గాయత్రి దేవి ,ఏఈ, డిఈలు, సిబ్బంది పాల్గొన్నారు.