calender_icon.png 8 July, 2025 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలను పట్టించుకునే నాథుడేడి..?

08-07-2025 12:12:24 AM

- సమస్యలకు నిలయంగా గిరిజన ఆశ్రమ పాఠశాల 

- నిద్రపోతున్న నిఘా నేత్రాలు

- నిరుపయోగంగా మరుగుదొడ్లు

- చెత్తను తొలగించడంలో నిర్లక్ష్యం

- పనిచేయని సోలార్‌వాటర్ హీటర్

- కరెంటు పోతే చిమ్మ చీకటే..

బెజ్జూర్, జూలై 7(విజయక్రాంతి): గిరిజన ఆశ్రమ పాఠశాల సమస్యలకు నిలయంగా మారింది.  బెజ్జూర్ మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో సమస్యలతో విద్యా ర్థులు ఇబ్బందులు పడుతున్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 338 మంది విద్యార్థులు విద్య ను అభ్యసిస్తున్నారు.

పాఠశాల ప్రాంగణానికి పూర్తిస్థాయిలో పరారీ లేకపోవడం తో స్నానానికి వెళ్లే సమయంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నామని,  12 మరుగుదొడ్లు పని చేయడం లేదని తీవ్రంగా ఇబ్బం దులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. సెప్టిక్ ట్యాంక్‌లకు పైకప్పులు లేకపోవడంతో దుర్వాసనతో ఇబ్బందులు తప్పడం లేదని, సోలార్ లైట్లు సైతం పనిచేయ డం లేదు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో సోలార్ లైట్ బ్యాటరీ  దొంగతనానికి గురైన సంఘటన ఉంది.

పాఠశాల వెనకాల  చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి ఉన్నా యి. వర్షాకాలం కావడంతో పాములు ,తేళ్లు లోపలికి ప్రవేశించే అవకాశం ఎంతైనా ఉంద ని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులకు రాత్రి సమయంలో నిద్రించేందుకు సరిపడ గదులు లేకపోవడంతో తరగతి గదులలోని నిద్రించాల్సిన పరిస్థితిగా మారిందని తెలుపుతున్నారు. ల్యాబ్‌కు సంబంధించి న సామాగ్రి సైతం అందుబాటులో లేదని తెలుపుతున్నారు.

ఇన్వెటర్  లేకపోవడంతో కరెంటు పోతే చిమ్మ చీకటిలోనే దోమలతో, గదులలో ఉక్కపోతతో గడపాల్సిన పరిస్థితిగా  నెలకొందని చెబుతున్నారు.  పురాతన బిల్డింగ్ యొక్క పైకప్పు పెచ్చులు ఊడి పడుతున్నాయ ని ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితిగా మారిందని ఆందోళన చెందుతున్నారు.

నీరు నిల్వ ఉన్నచోట బ్లీచింగ్ పిచికారి లేకపోవడంతో దోమలు విపరీతంగా పెరిగే అవకా శం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నా రు. మరుగుదొడ్లు,స్నానపు గదుల వైపు అపరిశుభ్రత, దుర్వాసన, చెత్త చెదారం పేరుకుపోయి ఉండడంతో విద్యార్థులు అనారోగ్య బారిన పడే అవకాశం ఉందని విద్యా ర్థుల తల్లిదండ్రులు తెలుపుతున్నారు. 

ఈ విషయమై జీసీడీవో శకుంతలను వివరణ కోరగా.. విద్యార్థులకు అన్ని రకాల వస తులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించామని, విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.