01-07-2025 02:57:55 AM
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 30 (విజయక్రాంతి): జంక్షన్ అభివృద్ధి యుద్ధప్రాతి పదికన పూర్తి చేయాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. సోమవారం శేరిలింగంపల్లి జోన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. జంక్షన్ అభివృద్ధిలో 11 ఆస్తులు కో ల్పోతున్న వారితో మాట్లాడి, సాయంత్రం వరకు నివేదిక ఇవ్వాలని జోనల్ కమిషనర్‌ను ఆదేశించారు. స్టాండింగ్ కమిటీలో చ ర్చించి చర్యలు తీసుకుంటామన్నారు.
బ్రహ్మ శంకర్‌నగర్‌లో ఓపెన్ జిమ్, మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను పరిశీలించి నిర్దేశించిన కాలవ్యవధిలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జోనల్ కమిషనర్‌ను కోరారు. మూడు అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించి పిల్లలకు అందిస్తున్న పోషకాహారం వివరాలను తెలుసుకున్నారు. మరో అంగన్వాడీ కేంద్రం ఏ ర్పాటు చేయాలని బస్తీ వాసులు మేయర్‌ను కోరగా.. తగు చర్యలు తీసుకోవాలి జోనల్ కమిషనర్‌ను ఆదేశించారు. యూసఫ్ గూడ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ను పరిశీలించి స్వచ్ఛ ఆటో డ్రైవర్‌లతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసు కున్నారు.
కేటాయించిన ఇంటింటి చెత్త సేకరణ చేయని వారి స్థానంలో ఇంకొక నిరుద్యోగ యువతకు అలాట్ చేస్తామన్నారు. ట్రాన్స్‌ఫర్ స్టేషన్ కెపాసిటీ పెంచాల ని జోనల్ కమిషనర్, ఏసీ శానిటేషన్ రాంకీ యాజమా న్యాన్ని ఆదేశించారు. అనంతరం రహమత్ నగర్, బ్రహ్మ శంకర్ నగర్, యూసఫ్ గూడ ప్రదేశాలలో మేయర్ పనులను పరిశీలించారు. ఆమె వెంట కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, జోనల్ కమిషనర్ హేమంత్ సహదేవ్‌రావు, సీఈ సహదేవ్ రత్నాకర్, ఏసీ శానిటేషన్ రఘు ప్రసాద్, ప్రాజెక్టు ఈఈ నూన్య నాసిక్, టౌన్ ప్లానింగ్ అధికారులు తులసి రామ్, శ్యామ్, డిప్యూటీ కమిషనర్ జాకీయ సుల్తానా ఉన్నారు.