29-11-2025 12:59:56 AM
సిద్దిపేట క్రైం, నవంబర్ 28 : తోపుడుబండ్లపై వ్యాపారాలు చేసేవారు ట్రాఫిక్, రోడ్డు నిబంధనలు పాటించాలని సిద్దిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ సూచించారు. సిద్దిపేటలోని సుభాష్ రోడ్డులోవ్యాపారాలు చేస్తున్న తోపుడుబండ్ల యజమానులకు పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం ట్రాఫిక్ ఇబ్బంది తలె త్తకుండా వ్యాపారం చేసుకోడానికి అనువైన ప్రదేశాలను సూచించారు.
పోలీసులు సూ చించిన ప్రదేశంలో కాకుండా ఇతర చోట్ల వ్యాపారాలు నిర్వహిస్తూ ట్రాఫిక్ ఇబ్బందు లు కలిగించినట్టయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సీఐ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.