calender_icon.png 29 November, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎఫ్.ఏ.క్యూ ప్రకారం కొనుగోలు చేయాలి

29-11-2025 12:59:12 AM

అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యా నాయక్

వనపర్తి, నవంబర్ 28 (విజయక్రాంతి ): వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎఫ్.ఏ.క్యూ (ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ) నిబంధనల ప్రకారం మాత్రమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యా నాయక్ ఆదేశించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఖీమ్యా నాయక్  శుక్రవారం పానుగల్ మండల పరిధిలోని ఐకెపి వరి కొనుగోలు కేంద్రం, వ్యవసాయ మార్కెట్ కమిటీ గోడౌన్ కు పర్యటించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్  ఎఫ్.ఏ. క్యూ (FAQ) నిబంధనల ప్రకారం మాత్రమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. అన్ని రిజిస్టర్లను సరిగా నిర్వహించాలని, కొనుగోలులో ముందుగా వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే, ట్యాగ్ చేయబడిన మిల్లుకు తరలించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ గారితో పాటు, పానుగల్ తహసీల్దార్, జిల్లా పౌర సరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్, డి ఎం జగన్ మోహన్,  పాల్గొన్నారు.