29-11-2025 01:00:39 AM
కలెక్టర్ విజయేందిర బోయి
రాజాపూర్, నవంబర్ 28: తొలి విడత గ్రామ పంచాయతీలకు జరుగనున్న ఎన్నికలలో రెండవ రోజు రాజాపూర్, తిరుమలాపూర్ పంచాయతీ కార్యాలయంలలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర బోయి సందర్శించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రంలో సదుపాయాలు పరిశీలించారు. నామినేషన్ పత్రాల స్వీకరణకు చేసిన ఏర్పాట్లు గమనించి పలు సూచనలు చేశారు.
ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా, ఉన్నతాధికారులను సంప్రదించాలని అన్నారు. రాజాపూర్ మండలంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో తిరుమలాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామంలో జరుగుతున్న నామినేషన్ ప్రక్రియలు పరిశీలించిన కలెక్టర్ విజయేందిర బోయి పోలింగ్కు సంబంధించిన ఏర్పాట్ల వివరాలను, నామినేషన్ వివరాలు సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించారు.
అంగన్వాడి లలో గర్భిణీలు,పిల్లలకు సక్రమంగా పౌష్టిక ఆహారం అందించాలన్నారు. చెన్నవెల్లి గ్రామంలోని ఐ కె.పి వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ను కలెక్టర్ విజయేందిర బోయి తనిఖీ చేశారు.కొనుగోలు కేంద్రంలో రైతులు తెచ్చిన ధాన్యం వెంటనే ఎప్పటికప్పుడు తేమశాతం చెక్ చేయాలనీ,తేమ శాతం వచ్చిన ధాన్యం తూకం వేసి కొనుగోలు చేయాలని ఆదేశించారు. రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి సంబంధిత రికార్డులను పరిశీలించారు.
రాజాపూర్ మండలం తిరుమలాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన మొక్కజొన్న ఆన్లైన్ వివరాల నమోదు ప్రక్రియను, రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రాధాకృష్ణ ఎంపీడీవో విజయలక్ష్మి మండల అధికారులు పాల్గొన్నారు.