05-08-2025 12:00:00 AM
హైదరాబాద్, ఆగస్టు 4: రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను కొట్టివేయాలంటూయ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టును సంప్రదించారు. గతంలో సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పలు ఠానాల్లో కౌశిక్‌రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. ఒకే ఘటనపై కాంగ్రెస్ నేతలు ఇచ్చిన వేర్వేరు ఫిర్యాదులపై పోలీస్ స్టేషన్‌లలో కేసులు పెట్టారని కౌశిక్‌రెడ్డి లాయర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా కేసులు నమోదు చేశారని వాదించారు. కేసులపై స్టే విధించి, అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. అన్ని పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తరులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.