07-08-2025 11:31:06 PM
రామగుండం ట్రాఫిక్ ఎసిపి శ్రీనివాస్..
గోదావరిఖని (విజయక్రాంతి): గోదావరి ఖని స్థానిక మున్సిపల్ జంక్షన్ వద్ద ఎసిపి శ్రీనివాస్(ACP Srinivas), రామగుండం ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు(Traffic CI Rajeshwara Rao) అధ్వర్యంలో హరి శేఖర్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ లు, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది వాహనదారులు హెల్మెట్ ధరించి నడిపిన మహిళలకు ఏసిపి ఆధ్వర్యంలో గిఫ్ట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని, కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, వాహనానికి సంబంధించిన పత్రాలు ఉండాలని, త్రిబుల్ రైడ్, సిగ్నల్ జంప్ లు చేయరాదని, స్వీట్ డ్రైవింగ్ చేయరాదని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం తాగి వాహనం నడప రాదని, అటువంటి వారిపై చట్టపరమైన చర్య తీసుకోబడుతుందని ఏసిపి తెలిపారు. హెల్మెట్ ధరించి వాహనం నడిపిన మహిళలు మరికొందరికి ఆదర్శంగా ఉండాలని ట్రాఫిక్ పోలీస్ లు ఫైన్ కొట్టడమే కాదు, ట్రాఫిక్ రూల్ పాటించిన వారికి గిఫ్ట్ పంపిణీ కార్యక్రమం చేసి ప్రజలలో మార్పు రావాలని ఈ కార్యక్రమం నిర్వహించారు.