calender_icon.png 8 August, 2025 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడేందుకు టిఎస్ యుటిఎఫ్ కృషి

07-08-2025 11:25:32 PM

టిఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి దామోదర్..

హుజూర్ నగర్: ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడేందుకు టిఎస్ యుటిఎఫ్ కృషి చేస్తుందని టిఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఆర్. దామోదర్(TS UTF District Secretary Damodar) అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ హుజూర్ నగర్ మండల కమిటీ ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరం సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా ప్రారంభించి మాట్లాడారు. అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోరాటాల మార్గమే ఎజెండాగా పనిచేసే టీఎస్ యుటిఎఫ్ సంఘానికి సభ్యత్వాన్ని ఇచ్చి సంఘ బలోపేతానికి ఉపాధ్యాయ ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనం అన్నారు. ఉపాధ్యాయుని, ఉపాధ్యాయుల నుండి అనూహ్య స్పందన లభించిందన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు సందర్శించి అత్యధిక సభ్యత్వాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యురాలు జెట్టి కమల,మండల అధ్యక్ష, కార్యదర్శులు అన్నపురెడ్డి రాజశేఖర్ రెడ్డి, వడ్లానపు రామకృష్ణ,లక్ష్మీకాంత్,చిక్కుళ్ళ గోవింద్,శ్రీనివాస్ రెడ్డి,ఇందిరాల జ్యోతి, బానోతు శ్రీను,సైదులు, ప్రభాకర్ రెడ్డి, అజయ్,చంద్రశేఖర్,తదితరులు, పాల్గొన్నారు.