calender_icon.png 8 August, 2025 | 1:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాలక్ష్మి పథకం పేరిట మభ్యపెడుతున్నారు

07-08-2025 11:44:42 PM

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్ (విజయక్రాంతి): నిన్నటి దాకా ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డల మధ్య కొట్లాటలు పెట్టారని, ఇప్పుడు మహాలక్ష్మిపేరిట మభ్యపెట్టి అక్కాచెల్లెళ్ల జట్లు పట్టుకొని కొట్టుకునేలా చేస్తారా అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోస్టాఫీసులో మహాలక్ష్మి పథకం కోసం మొదలైన ఇలాంటి ఘర్షణలు పల్లెపల్లెకు పాకే ప్రమాదం పొంచి ఉందని గురువారం ఎక్స్‌లో ఆయన పోస్టు చేశారు. కోటి మందిని కోటీశ్వరులను చేయడం దేవుడెరుగు.. కనీసం గ్యారెంటీ కార్డులో పెట్టిన రూ.2,500ల మహాలక్ష్మి హామీని ఇప్పటికైనా నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.